ETV Bharat / state

'కులమతంతో సంబంధం లేని ధ్రువీకరణ పత్రం కావాలి'

తమ బిడ్డకు ఏ కుల, మత ప్రస్తావన లేని జనన ధ్రువీకరణ పత్రం జారీ చేయాలంటూ... ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

pil for no religion birth certificate
'మతంతో సంబంధం లేని ధ్రువీకరణ పత్రం కావాలి'
author img

By

Published : Apr 29, 2020, 1:58 PM IST

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్లో మతం, కులం ప్రస్తావన తొలగించాలని కోరుతూ.. మతాంతర వివాహం చేసుకున్న ఓ జంట హైకోర్టును ఆశ్రయించింది. హైదరాబాద్​కు చెందిన రూప, డేవిడ్ మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి గతేడాది మార్చి 23న మగ శిశువు జన్మించాడు. తమ కుమారుడికి జనన ధ్రువీకరణ పత్రం కోసం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులో మతం అనే కాలమ్ నింపితేనే జనన ధ్రువీకరణ పత్రం ఇస్తామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు. తమకు మతంపై విశ్వాసం లేదని.. మతాంతర వివాహం చేసుకున్నందున.. తమకు ఏ మతంతో సంబంధం లేని ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోరారు.

కుల, మత ప్రస్తావన లేని..

మున్సిపాలిటీ అధికారులు నిరాకరించగా.. జిల్లా కలెక్టర్​కు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది గడిచినప్పటికీ.. ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదంటూ ఆ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడికి జీవితంలో ఏ సందర్భంలోనూ.. కుల, మత ప్రస్తావన లేని విధంగా ధ్రువీకరణ పత్రం ఇచ్చి.. అలాంటి ప్రస్తావన అవసరం లేకుండా జారీ చేసేలా విధివిధానాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి..

మతాన్ని విశ్వసించే హక్కుతో పాటు.. విశ్వసించని హక్కు కూడా రాజ్యాంగం కల్పించిందన్నారు. గతంలో పలు సందర్భాల్లో కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ.. ఆన్​లైన్ దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు సమస్య ఏర్పడుతోందని.. శాశ్వత పరిష్కారం చూపాలని కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం.. నాలుగు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఇవీ చూడండి: ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.