ETV Bharat / state

ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలి: ఎర్రబెల్లి - wanaparthi district latest news

రోజురోజుకూ కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. వ్యాక్సినేషన్​పై మరింత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.

Minister Errabelli video conference
Minister Errabelli video conference
author img

By

Published : Apr 20, 2021, 4:48 AM IST

కరోనా రెండోదశ వ్యాప్తి వేగంగా జరుగుతోన్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్ఛితంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అడిషనల్ కలెక్టర్లు, డీఆర్డీవో అధికారులు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. కొవిడ్​ ఉద్ధృతి దృష్ట్యా గ్రామ పంచాయతీ సెక్రటరీ, డీఆర్​డీఏ అధికారులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ఐకేపీ సంఘాల ద్వారా మాస్కులను తయారుచేయించి.. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహించే వారికి మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు నీటి సరఫరా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు వ్యాక్సినేషన్​పై అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ చూడండి: ఫీడ్ ది నీడ్ బృందానికి సీపీ సజ్జనార్ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.