వనపర్తిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. శ్వేతా నగర్ , గాంధీచౌక్, అంంబేద్కర్ చౌరస్తా, బ్రహ్మం గారి వీధి , శ్రీరామ టాకీస్ ప్రాంతాల్లో వానలకు దెబ్బతిన్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో వారి సమస్యలపై చర్చించారు.
కారణాలపై ఆరా..
నివాసాల్లోకి నీరు చేరడానికి గల ప్రధాన కారణాలపై ఆరా తీశారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వాగు పునరుద్ధరించాలి..
తాళ్ళచెరువుపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి వాగు పునరుద్ధరించాలని పుర యంత్రాంగానికి సూచించారు. అవసరమైతే వాగును లోతుగా తవ్వించి వర్షపు నీరు అలవోకగా వెళ్ళేలా చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం సరికాదని.. అనుమతులు లేని కట్టడాలను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. గాంధీ చౌక్ ఏరియాలోని వ్యాపార సముదాయాలు పరిశీలించిన మంత్రి వారితో మమేకమయ్యారు.