వనపర్తి జిల్లాలో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో చెరువులు, కుంటలు నిండి అలుగు పారుతున్నాయి. రైతుల ఆనందరం వ్యక్తం చేస్తున్నారు. పానుగల్ మండలం కొత్తపేట, బూసిరెడ్డిపల్లి, రాయినిపల్లి గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కేతపల్లి గ్రామ సమీపంలో ఉన్న భీమా ఉప కాల్వలు నిండి పంట పొలాల మీదుగా ప్రవహిస్తున్నాయి.
వరద కాలువలు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల చుట్టుపక్కల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండల పరిధిలో 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. నెలరోజులుగా జిల్లాలో సమృద్ధిగా కురుస్తున్నాయి.
ఇదీ చదవండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!