ETV Bharat / state

'కేంద్ర పథకాలను విస్తృతంగా తీసుకెళ్లండి... అన్నీ మనమే గెలుస్తాం' - bjp-laxman-on-elections

వనపర్తి జిల్లా కొత్తకోట పుర పరిధిలోని భాజపా అభ్యర్థులు, కార్యకర్తలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఇంటింటికీ తిరిగి కేంద్ర పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని ఆయన కోరారు.

భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్
భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్
author img

By

Published : Jan 18, 2020, 3:45 PM IST

ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాల గురించి, మున్సిపాలిటీలకు కేంద్రం అందిస్తున్న నిధులపై ప్రజలకు వివరించాలని భాజపా అభ్యర్థులకు, శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానికంగా ఉండే పురపాలికల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆరేళ్లు గడిపేశారని దుయ్యబట్టారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, నిరుద్యోగ భృతి పథకాల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

'మరో భైంసా కాకూడదంటే... భాజపానే గెలిపించండి'

ఎన్నికలను డబ్బుతో గెలవాలని తెరాస యత్నిస్తోందని, ప్రజలు గులాబీ పార్టీతో విసిగివేసారి పోయారని... ఇప్పుడు వారు మార్పు కోరుకుంటున్నారని లక్ష్మణ్ తెలిపారు. పుర ఎన్నికల్లో కాషాయ దళం మంచి ఫలితాలు సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెరాస గెలిస్తే లాభ పడేది మజ్లిస్ పార్టీనే అని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరో భైంసా కాకూడదంటే కాషాయ జెండా ఎగిరేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భాజపా గెలవకుంటే ఉమ్మడి పాలమూరు మరో భైంసా అవుతుంది : లక్ష్మణ్

ఇవీ చూడండి : బూటకపు వాగ్దానాలు నమ్మొద్దు.. తెరాసకు షాక్ ఇద్దాం : ఉత్తమ్

Intro:వనపర్తి జిల్లా , కొత్తకోట పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ అభ్యర్థులు మరియు బిజెపి కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Body:వనపర్తి జిల్లా , కొత్తకోట పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని కౌన్సిలర్ అభ్యర్థులు మరియు బిజెపి కార్యకర్తలతో సమావేశమయ్యారు.
బిజెపి కౌన్సిలర్ అభ్యర్థులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సాహసోపేత నిర్ణయాల గురించి మరియు మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గ్రాంట్స్ గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కుటుంబ పాలన తో కెసిఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని లక్ష్మణ్ తెలిపారు.
స్థానికంగా ఉండే మున్సిపాలిటీలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆరు సంవత్సరాలు గడిపేశారు అని దుయ్యబట్టారు.
రెండు పడక గదుల ఇల్ల నిర్మాణాలు , నిరుద్యోగ భృతి వంటి ఎన్నో పథకాలను ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న విధంగా ఉందని తెలిపారు.
మున్సిపాలిటీ ఎన్నికలలో డబ్బు పెట్టి గెలవాలని టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని, కానీ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ తో విసిగి వేసారి పోయారని మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని తెలిపారు.
టిఆర్ఎస్ గెలిస్తే మజ్లిస్ లాభ పడుతుందని ...మహబూబ్ నగర్ జిల్లా మరో భైంసా అవకూడదు కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక సంఖ్యలో మున్సిపాలిటీలలో ప్రజలు బీజేపీ జెండా ఎగిరేలా చేస్తారని తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎం.పి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Conclusion:కిట్ నెంబర్ 1269,
పి.నవీన్,
9966071291.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.