వనపర్తి
వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపాలిటీ అధ్యక్షునిగా గట్టు యాదవ్, ఉపాధ్యక్షునిగా వాకిటి శ్రీధర్ ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
కొత్తకోట
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా సుఖేశిని, ఉపాధ్యక్షురాలుగా జయమ్మ ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
పెబ్బేరు
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా కరుణ శ్రీ, ఉపాధ్యక్షుడుగా కర్రె స్వామి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆత్మకూరు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా గాయత్రి, ఉపాధ్యక్షుడుగా విజయ భాస్కర్ రెడ్డి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అమరచింత
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ అధ్యక్షురాలుగా మంగమ్మ, ఉపాధ్యక్షుడుగా గోపి సీపీఎం నుంచి ఎంపికయ్యారు. వారిచే కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇదీ చూడండి : బస్తీకా బాద్షా: కాంగ్రెస్ కంచుకోటలో తెరాస పాగా