వికారాబాద్ జిల్లాలో కారు దూసుకెళ్లింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లాలోని ఛైర్మన్, వైస్ ఛైర్మన్ స్థానాలన్నింటిని తెరాస కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో వికారాబాద్, కొడంగల్, పరిగి, తాడ్వాయిలలో కారు స్పీడుకు ఇతర పార్టీలు కళ్లెం వేయలేకపోయాయి.
వికారాబాద్ మున్సిపాలిటీ ఛైర్మన్గా చిగుళ్లపల్లి మంజుల, వైస్ ఛైర్మన్గా శంషాద్ బేగం ఎన్నికయ్యారు. పరిగి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని ముకుంద అశోక్, వైస్ ఛైర్మన్ పీఠాన్ని ప్రసన్నలక్ష్మి కైవసం చేసుకున్నారు. తాండూరు మున్సిపల్ ఛైర్మన్గా తాటికొండ స్వప్న, వైస్ ఛైర్మన్గా దీప ఎన్నికయ్యారు. కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్గా జగదీశ్వర్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా ఉషారాణిలు ఎన్నికయ్యారు. జిల్లా వ్యాప్తంగా తెరాస జయకేతనం ఎగరవేసింది.
వికారాబాద్ - తెరాస క్లీన్ స్వీప్
- వికారాబాద్ మునిసిపల్ ఛైర్మన్ చిగిల్లపల్లి మంజుల - వైస్ ఛైర్మన్ శంషాద్ బేగం
- పరిగి మునిసిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్ - వైస్ ఛైర్మన్ ప్రసన్న లక్ష్మీ
- తాండూరు మునిసిపల్ ఛైర్మన్ తాటికొండ స్వప్న - వైస్ ఛైర్మన్ దీప
- కొడంగల్ మునిసిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి - వైస్ ఛైర్మన్ ఉషారాణి