ETV Bharat / state

దాడి జరిగిందని కేసు పెడితే... తిరిగి తమపైనే పెట్టారని పెట్రోల్ పోసుకుని... - వికారాబాద్ జిల్లా తాజా వార్తలు

PERSON SUICIDE ATTEMPT: కుల్కచర్ల పోలీస్ స్టేషన్ ఎదుట నిన్న ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పెట్రోల్ పోసుకుంటుండగా గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని నిలువరించారు.

వెెంకట్
వెెంకట్
author img

By

Published : Jun 5, 2022, 6:48 PM IST

PERSON SUICIDE ATTEMPT: తన తమ్ముడిపై దాడి చేసిన వ్యక్తులపై కాకుండా తిరిగి తమపైనే కేసు నమోదు చేశారని ఓ వ్యక్తి శనివారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రెవర్​గా అంజనేయులు విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామంలో ఓ పార్టీకి చెందిన దిమ్మె రోడ్డుకు అడ్డుగా ఉండటంతో ట్రాక్టర్ నడిపేందుకు ఇబ్బందిగా ఉందని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాడు.

దీంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అంజనేయులపై దాడి చేశారు. దీనిపై బాధితుడి అన్న వెంకట్ కుల్కచర్ల పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు దాడి చేసిన వ్యక్తులపై కాకుండా తిరిగి తమపైనే కేసు నమోదు చేశారని పోలీస్ స్టేషన్​ ఎదుట వెంకట్ పెట్రోల్​ పోసుకొని నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుంటుండగా గమనించిన కొందరు వ్యక్తులు అతన్ని నిలువరించారు.

తమపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం.

ఇదీ చదవండి: Tamilisai on Rape case: రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించండి: తమిళిసై

నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు గల్లంతు.. నలుగురు బాలికలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.