వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని మైహిష గిరి కొండ శివ నామస్మరణతో మార్మోగింది. శివానంద గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. 41 రోజుల పాటు నిష్టగా మాలాధారణ చేసి నిర్వహించే ఈ మహా పడి పూజకు శివ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి పారవశ్యంలో శివ స్వాములు, భక్తులు మునిగిపోయారు. పూజని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం వల్ల మైహిష గిరి కొండ కిక్కిరిసిపోయింది.
ఇవీ చూడండి : 'చంపుతాడనే భయంతో... తండ్రిని చంపేశాడు'