గత నెల 26, 28 తేదీల్లో ఏపీ22యు0522 నంబరు గల లారీ బషీరాబాద్ రైల్వే స్టేషన్ రోడ్డుపై నిలిపారు. ఆ రెండు తేదీల్లో కలిపి రూ.270 జరినామా విధిస్తూ పోలీసులు పోస్టులో చలాన్ పంపించారు. కానీ అది లారీ ఓనరుకు కాకుండా కొడంగల్ పట్టణంలోని బాలాజీనగర్ కాలనీకి చెందిన హన్మంతు ఇంటికి వచ్చింది.
వాహన చలాన్‌ను పరిశీలించగా.. లారీ నిలిపిన ఫొటోలు, చలాన్ కట్టాలని పోస్టులో ఉంది. తనకు లారీయే లేదని, లేనిదానికి డబ్బులు కట్టాలని రావడం విడ్డూరంగా ఉందని హన్మంతు తెలిపారు. వెంటనే కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వివరించగా.. చిరునామా తప్పుగా నమోదు కావడం వల్ల వచ్చి ఉండవచ్చని పోలీసు సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండిః నాలుగేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం