వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ విపణి నూతన పాలకవర్గం అధ్యక్షులుగా విఠల్ నాయక్, ఉపాధ్యక్షునిగా వెంకట్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం వీరి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ పాలక వర్గాలు రైతు సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని వారు సూచించారు.
తెరాస ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేస్తోందన్నారు. రైతులకు మద్దతు ధర, రైతు బీమా వంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుందని వారు తెలిపారు.
ఇవీ చదవండి: రోడ్డు ప్రమాదం: ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్రగాయాలు