వికారాబాద్ జిల్లాలో 115 మందిని కొవిడ్-19 పరీక్షల కోసం పంపించగా, వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని ఎస్పీ నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌జోన్ ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.
వికారాబాద్ టౌన్ రిక్షా కాలనీలో ఏడు, బీటీఎస్ కాలనీలో ఇద్దరు, మధు కాలనీలోని మదర్సాలో ఒకరు, తాండూర్ శివారులోని రాజీవ్ కాలనీలో ఓ మహిళకు పాజిటివ్ సోకినట్లు వివరించారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టిన నలగురిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చూడండి : 'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'