కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తోన్న ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. సూర్యాపేటలో కోవిడ్ -19 తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకాధికారిని నియమించింది.
పురపాలకశాఖలో ఉపసంచాలకులుగా పనిచేస్తున్న వేణుగోపాల్ రెడ్డిని సూర్యాపేటలో కరోనా నివారణ చర్యలకు ప్రత్యేకాధికారిగా నియమించారు. ఈ మేరకు పురపాలకశాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో వేణుగోపాల్ రెడ్డి హుటాహుటిన సూర్యాపేట బయల్దేరి వెళ్లారు. ఆయన గతంలో ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు.