సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి స్టేజి వద్ద ద్విచక్ర వాహనం కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన సతీశ్, లింగస్వామి.. ఫణిగిరికి వెళ్లి స్వగ్రామం తిరిగి వస్తున్నారు. ఫణిగిరి స్టేజి వద్ద లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన కారును ద్వి చక్రవాహనం ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో లింగస్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సతీశ్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమయానికి 108 వాహనం అందుబాటులో లేక పోవడం వల్ల.. సతీశ్ ను పోలీసులు తమ వాహనంలోనే.. సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి: భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా