వినయక నవరాత్రోత్సవాల నిర్వాహణ రోజురోజుకీ రూపాంతరం చెందుతోంది. భజన పాటలు వినిపించాల్సిన మండపాల్లో డీజే పాటలు దద్దరిల్లుతున్నాయి. భక్తితో ఉల్లసంగా ఉత్సాహంగా గణపతిని సాగనంపాల్సిన యువత.. బ్యాండ్లు, డీజేలతో ఉర్రూతలూగుతూ శోభయాత్రలు తీస్తున్నారు. గణపతి పాటలకే డీజే హంగులద్ది కొందరు సంతోషపడితే.. సినిమా పాటలు, జానపద పాటలు పెట్టుకుని ఒళ్లు హూనమయ్యేలా మరికొందరు పిచ్చిగెంతులేస్తున్నారు. ఇంకొందరైతే.. భక్తిభావాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మత్తులో తూగుతూ.. సంప్రదాయాలను మంటగలుపుతున్నారు.
ఇంకొందరైతే.. ఓ అడుగు ముందుకేసి యువతులతో రికార్డింగ్ డాన్సులు పెట్టేశారు. భక్తిని మరిచి రక్తి పారవశ్యంలో మునిగిపోయారు. అసలు సందర్భమేంటీ.. వాళ్లు చేస్తున్న పనేంటీ.? అన్న విచక్షణ కోల్పోయి.. గ్రామస్థులను ముక్కున వేలేసుకునేలా చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
గరిడేపల్లి మండంల పొనుగోడు గ్రామంలో శుక్రవారం వినాయకుని నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో భాగంగా పొనుగోడు వీధుల్లో గణేశ్ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతులతో రికార్డింగ్ డాన్సు(Recording Dance)లు చేయించారు. సినిమా పాటలకు అమ్మాయిలతో.. జుగుప్సాకరంగా స్టెప్పులేస్తూ నానా రచ్చా చేశారు. ఇప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేవుడి దగ్గర భజనలు చేయడం చూశాం కానీ... ఇలా రికార్డింగ్ డాన్సులు చేయడమేంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని... ఈసారే ఇలా నిర్వహించారని వాపోయారు.
ఇదీ చూడండి: