అల్పపీడన ప్రభావంతో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోదాడ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో చెరువులు అలుగులు పోస్తున్నాయి. కోదాడ పెద్ద చెరువు పొంగిపొర్లుతూ... గుట్టపై నుంచి నీరు కిందకు జాలువారుతోంది.
మండలాల్లో బీభత్సం
మునగాల మండలం గణపవరం, తాడువాయి వద్ద రహదారిపై నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మోతె మండలం ఉర్లుగొండ వద్ద పాలేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అనంతగిరి మండలం గొండ్రియాల వంతెనపై నుంచి ఉద్ధృతంగా నీరు ప్రవహిస్తుండడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంటలు జలమయం
నడిగూడెం మండలం కోమరబండ మేజర్ కాలువకు గండి పడి పంటపొలలు నీట మునిగాయి. కోదాడ నియోజకవర్గంలో వరి, పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: భారీ వర్షాలకు నిండిన చెరువులు.. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు