ETV Bharat / state

మానవత్వం చాటిన పోలీస్... క్షతగాత్రుడిని బైక్​పై ఆస్పత్రికి తరలింపు - గాయపడిన వ్యక్తిని కాపాడిన పోలీస్ కానిస్టేబుల్

ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకుని మానవత్వం చాటుకున్నారు సూర్యాపేట జిల్లా మద్దిరాల పోలీస్ కానిస్టేబుల్. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్ర గాయాలైన వ్యక్తికి వైద్యం చేయించారు. సకాలంలో 108 వాహనం రాకపోవడంతో తన బైక్​పైనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

police constable reused a person injured in accident
క్షతగాత్రునికి వైద్య చేయించిన పోలీస్ కానిస్టేబుల్​ శ్రీనివాస్
author img

By

Published : Apr 13, 2021, 8:45 AM IST

ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి వైద్యమందించి మానవత్వం ప్రదర్శించారు పోలీస్​ కానిస్టేబుల్ శ్రీనివాస్​. సూర్యాపేట జిల్లా మద్దిరాల క్రాస్​రోడ్​ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి సోమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.

మొదట 108 వాహనానికి ఫోన్​ చేయగా సమయానికి రాలేదు. దీంతో కానిస్టేబుల్ శ్రీనివాస్​, దామోదర్​ గౌడ్​ తమ బైక్​పై మద్దిరాలలోని సాయిబాలాజీ ఆస్పత్రికి తరలించి వైద్యమందించారు. ఆపదలో ఉన్న వ్యక్తిని మంచిమనసుతో ఆదుకున్న పోలీసుకు బాధితుని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు .

ఇదీ చూడండి: శంషాబాద్​ ఎయిర్​పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.