ETV Bharat / state

ఆలయ భూములను కాపాడాలని దున్నపోతుకు వినతిపత్రం

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధికి చెందిన కోదండరామస్వామి దేవాలయ భూములను కాపాడాలని దున్నపోతుకు వినతిపత్రం అందించారు. దేవాలయ భూముల సర్వే చేపట్టి...వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని దేవాలయ భూముల పరిరక్షణ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

కోదండరామస్వామి ఆలయ భూములను కాపాడాలని దున్నపోతుకు వినతిపత్రం

author img

By

Published : Aug 9, 2020, 4:43 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన కోదండరామస్వామి దేవాలయ భూములను కాపాడాలని దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దేవాలయ భూముల పరిరక్షణ సమితి సభ్యులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దేవాలయ భూముల సర్వే చేపట్టి... వాటికి హద్దులు ఏర్పాటు చేయాలని పరిరక్షణ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా...

దేవాలయ భూములు ఆలయానికే చెందేలా చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా... సమస్యను పట్టించుకున్న నాథుడే లేడని సమితి సభ్యులు వాపోయారు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించినప్పికీ పట్టించుకోని నేపథ్యంలోనే దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశామని పరిరక్షణ సమితి అధ్యక్షుడు కిమ్మెర నాగరాజు వెల్లడించారు. కార్యక్రమంలో పరిరక్షణ సమితి గౌరవ సలహాదారులు వేమూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది: చాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.