సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మను పూజించాలనే ముఖ్య ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాలలో మాతృమూర్తుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో పాటు క్రిస్మస్, సంక్రాంతి, బతుకమ్మ వేడుకలను యాజమాన్యం నిర్వహించింది.
తల్లులు వారి చిన్నారులతో ఆడి, పాటలు పాడారు. తల్లికి పిల్లలకు మధ్య మంచి వాతావరణం ఉండాలని, తల్లులను అనాథాశ్రమాలకు పంపించకుండా చూసుకోవాలని పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి సూచించారు.
ఇదీ చూడండి : పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు...