సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ సమీపంలో ఉల్లి లోడ్తో వెళ్తున్న లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది క్వింటాళ్ల ఉల్లి నేలపాలైంది. రాయచూర్ నుంచి ఖమ్మంకు లారీ బయలుదేరింది. మార్గమధ్యలో ఒక్కసారిగా ఈ ప్రమాదం వల్ల రోడ్డు మీద ఉల్లి పడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని రోడ్డుపై పడ్డ ఉల్లిపాయల బస్తాలను తొలగించేశారు.
ఇదీ చూడండి : గుట్టుగా సాగుతున్న గంజాయి దందా