ప్రతీ ఒక్కరినీ కలుపుకొని హుజూర్నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తామన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లతోపాటు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు సంబంధించి... అధికారులు, రాజకీయ నాయకుల సలహాలు స్వీకరిస్తామన్నారు. నీతి నిజాయితీగా పాలన నడవాలని తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం