సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన శానంపూడి సైదిరెడ్డి శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సైదిరెడ్డితో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ఉప సభాపతి పద్మారావు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డి తదితరులు హాజరై సైదిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం, ప్రభుత్వ పథకాలకు ప్రజల ఆశీర్వాదం ఉందనడానికి హుజూర్నగర్లో సైదిరెడ్డి గెలుపే నిదర్శనమని మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని పది నెలల్లో చేసి చూపుతామని ఆయన స్పష్టం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... కోర్టుకు నివేదికపై సమాలోచనలు!