సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సూర్యానాయక్ తండాలో గొర్రెకు జరిమానా వేశారు అధికారులు. హరితహారం మొక్కలు తిన్నందుకు రూ.1000 జరిమానా విధించారు. అనంతరం యాజమానికి సమాచారం ఇచ్చి.. గొర్రెను పంచాయతీ కార్యాలయంలో బంధించారు. అధికారులకు డబ్బులు చెల్లించి గొర్రెను ఇంటికి తీసుకెళ్లాడు యాజమాని.
ఇవీ చూడండి: మేకకు రెండువేలు జరిమానా... ఎందుకంటే?