ETV Bharat / state

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం - utham

కాంగ్రెస్‌ తరఫున హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారాన్ని నేరేడుచర్లలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి ప్రారంభించారు. 30 వేల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం ఖాయమైనట్లేనని ధీమా వ్యక్తం చేశారు.

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం
author img

By

Published : Sep 22, 2019, 12:02 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారాన్ని... నేరేడుచర్ల మండల కేంద్రంలో టీపీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ 30 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇవ్వకుండా... ఆంధ్రోళ్లకు తెరాస టిక్కెట్‌ ఇవ్వడం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్నికల హామీలు 50శాతం కూడా అమలు కాలేదని విమర్శించారు. సీనియర్‌ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని జానారెడ్డి అన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం

ఇదీచూడండి:తెరాసలో ఓనర్లకు కిరాయిదారులకు గొడవ నడుస్తోంది: భట్టి

Intro:సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కొంతమంది వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి టిక్కెట్లు ఇవ్వకుండా ఆంధ్ర ప్రాంతం వారికి టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు డిఎస్పీలు సిఐలు ఎస్సై లుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు దళితులకు గిరిజనులకు ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమైందని ప్రశ్నించారు దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది అన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏమైంది అన్నారు రైతుబంధు నేరేడుచర్ల మండలం లో 50% కూడా అమలు కాలేదు అన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో విఫలం చెందిందని అన్నారు ఏ పథకం ప్రవేశపెట్టిన అమలు చేయలేదని ఎద్దేవా చేశారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8500 డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తే 500 ఇల్లు కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.