లాక్ డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయిన కూలీలకు దాతలు అండగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన ఇండియన్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకుడు గిరిధర్ రెడ్డి.. మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్, గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న కార్మికులందరికి నిత్యావసర సరకులు అందజేశారు.
విపత్కర పరిస్థితిలో పేదల పరిస్థితి దారుణంగా ఉందని.. మానవతా దృక్పథంతో వారికి తోచినంత సహాయం అందజేయాలని గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి.. సుమారు రెండు నెలలుగా నిర్విరామంగా పనిచేస్తూ.. మండల ప్రజలకు సహయ సహకారాలు అందించినందుకు సిబ్బందిని అభినందించారు.
ఇదీ చూడండి: రైతు రుణమాఫి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఈటల