ETV Bharat / state

అనుమతులిచ్చినా... తప్పని సరిహద్దు కష్టాలు - CORONA UPDATE

తెలంగాణ పోలీసులు అనుమతులిచ్చినా... ఏపీ చెక్​పోస్టులు వలస కూలీలకు నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నాయి. ఆంధ్రా- తెలంగాణ సరిహద్దులో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది కూలీలకు సూర్యాపేట జిల్లా రామాపురం చెక్​పోస్టు వద్ద పోలీసులు అనుమతివ్వగా... ఏపీ చెక్​పోస్టు వద్ద వారిని ఆపేశారు.

AP AND TELANGANA BORDER PROBLEMS FOR MIGRANTS
అనుమతులిచ్చినా... తప్పని సరిహద్దు కష్టాలు
author img

By

Published : May 4, 2020, 4:11 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్​పోస్ట్​ వద్ద అన్ని పర్మిషన్లు ఉన్న వాహనాలను రాష్ట్ర పోలీసులు ఆంధ్రప్రదేశ్​కు పంపిస్తున్నారు. ఆ వాహనాలను ఆంధ్రా చెక్​పోస్ట్ గరికపాడు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్రయాణికులను తెలంగాణ- ఆంధ్ర సరిహద్దుల్లో ఆపేశారు.

అన్ని రకాల అనుమతులు చూపిస్తున్నా... ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చిన్న పిల్లలతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేశామని, ఎండ తాపానికి ఇబ్బంది పడుతున్నామని ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులను వివరణ అడగ్గా... అన్ని రకాల అనుమతులు ఉన్న వారికే ఏపీలోకి అనుమతులు వుంటాయని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: లాక్​డౌన్​ నిబంధనలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.