సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 12వ రోజు సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. పలు విద్యార్థి సంఘాలు, విపక్ష నాయకులు కార్మికులకు మద్దతు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండానే కార్మికులు ర్యాలీ కొనసాగించారు. తడుచుకుంటూనే.. చౌరస్తాలో నిరసన తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వం మొండి వైఖరి వీడి... తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం