మమ్మల్ని కూడా ఆదుకోండంటూ బైక్ మెకానిక్లు.. ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న కారణంగా సిద్దిపేట పట్టణంలో బైక్ మెకానిక్ షాప్లు మూతపడ్డాయి. బైకులు రిపేర్ చేస్తేనే మా జీవనం సాగుతుందని.. మాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నామని వారు అన్నారు.
కానీ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వాహనదారులు రాక షాపులు మూతపడి పూటగడవడం కూడా కష్టంగా ఉందని వాపోయారు. వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.. కానీ మమ్మల్ని ఏ దాతలు ఆదుకోవడానికి ముందుకు రావడంలేదని.. మాకూ నిత్యావసరాలను అందించి ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల రేషన్ బియ్యం తమ కుటుంబాలకు సరిపోవడం లేదని బైక్ మెకానిక్లు ఆవేదన వ్యక్తం చేశారు.
"రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది.. నిరుపేదలందరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాం- బైక్ మెకానిక్"
ఇవీ చూడండి: శిక్షించడంలోనే కాదు... ఆదుకోవడంలోనూ మాకు మేమే సాటి