ETV Bharat / state

ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర - RENUKA ELLAMMA_MLA DHARSHANAM

హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర
author img

By

Published : May 31, 2019, 6:39 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా హుస్నాబాద్ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ప్రసిద్ధి. ఏటా నెలరోజులపాటు వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలు వైశాఖ పౌర్ణమి రోజున ప్రారంభమై, జేష్ఠ పౌర్ణమి వరకు కొనసాగుతాయి. నేడు శుక్రవారం అయినందున ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి బోనాలతో పట్నాలు వేయడం, చీరలు పెట్టి ఒడిబియ్యం పోయడం, గండ దీపాలు వెలిగించడం, కుంకుమార్చనలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. ఈ జాతర ఉత్సవాలు జూన్ 17 వరకు కొనసాగుతాయి.

ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర

ఇవీ చూడండి: మన కరీంనగర్​ 'గ్రేటర్' అవుతోంది!

Intro:TG_KRN_103_31_RENUKA ELLAMMA_MLA DHARSHANAM_AV_C11
FROM:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రతి సంవత్సరం రేణుక ఎల్లమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా నేడు శుక్రవారం శ్రీ రేణుక ఎల్లమ్మ వారిని ఎమ్మెల్యే సతీష్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించారు. రాష్ట్రము ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కూర్చొని కథకులు వాయిద్యాలు వాయిస్తూ శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్రను గేయరూపంలో పాడడాన్ని ఎమ్మెల్యే శ్రద్ధగా ఆలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ సుద్దల చంద్రయ్య కౌన్సిలర్లు ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో

Conclusion:అమ్మవారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.