సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతకపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ, జడ్పీ వైస్ ఛైర్మన్, ఎంపీపీ కలిసి ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని 17 శాతం తేమకు మించకుండా ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జడ్పీ వైస్ ఛైర్మన్ సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఇస్తున్న మద్ధతు ధరలకు ధాన్యాన్ని అమ్మి లబ్ధి పొందాలన్నారు.
ఇదీ చదవండిః 'రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజను కొంటాం'