సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని రైతులకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఎరువులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులకు వారి సొంత ఊళ్లలోనే ఎరువులు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, తెరాస నాయకులు, రైతులు పాల్గొన్నారు.