సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డి పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై మక్కలు ఆరబెట్టి అక్కడే నిద్రిస్తున్న వృద్ధురాలు పైనుంచి గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లింది. దీనితో ఆ వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది.
అసలేం జరిగిందంటే?
ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన కాలమెల్ల బుచ్చమ్మ(80)... చేగుంట రహదారిపై మక్కలను ఆరబెట్టింది. రాత్రి వాటికి కాపలాగా ఉండేందుకు అక్కడే నిద్రించింది. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆమె పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. రహదారిపై వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు