ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన - minister harish rao visit chintamadaka village

వారం, పది రోజుల్లో చింతమడక చెరువు కాళేశ్వరం జలాలతో నిండనున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో రూ.22 లక్షల రూపాయలతో నిర్మించే రైతు వేదిక నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన చేశారు.

minister-harish-rao-visit-chintamadaka-village-siddipet-district
రైతు వేదిక నిర్మాణానికి మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన
author img

By

Published : Jun 20, 2020, 9:01 PM IST

చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే క్రమంలో సీఎం హామీ మేరకు మూడు గ్రామాలు కలుపుకుని 1580 యూనిట్లు ఉండగా, ఇవాళ చింతమడకలో 133 మందితో కలిపి 1270 మందికి లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వెల్లడించారు.

గ్రామంలో రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నీళ్లుతో ప్రతి రైతుకు ఏటా రెండు పంటలు పండించుకునే వీలుందన్నారు. త్వరలో పాడి పశువులను పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం సూచనలు స్వీకరించి రైతులు నియంత్రిత సాగుకు ముందుకు వచ్చి పంటల సాగులో మార్పులు తెచ్చారని రైతులను అభినందించారు. ప్రతి గ్రామంలో రైతులు 60 శాతం సన్న రకం వరి సాగు చేయాలని మంత్రి కోరారు.

భూ స్థలాలు కొనుగోలు చేసేందుకుగాను 133 మందికి రూ.9 కోట్ల 87 వేల రూపాయల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. భూమి కొంటే పది కాలాలు మీకే ఉంటుందని, ఎవరూ భూములు అమ్ముకోవద్దని గ్రామస్తులను కోరారు. గ్రామాల్లో ఇళ్లు తొలగించని వారు కూడా ఇళ్లు తొలగించి స్థలాలను ఇస్తే.. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.

ఉచిత రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

గ్రామ లబ్ధిదారులు ఎక్కువ భూములు కొనుగోలు చేస్తున్న క్రమంలో రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి సందర్భంగా మంత్రి హరీశ్ రావు చొరవతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉచితంగా చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఎక్కువగా రిజర్వాయర్లు ఉన్న క్రమంలో గ్రామాల్లో ప్రతీ ఎకరానికి సాగునీరు అందే అవకాశం ఉన్నదని, దీంతో సిద్దిపేట జిల్లా వ్యవసాయ జిల్లాగా మారనున్నదని కలెక్టర్ పేర్కొన్నారు.

వారం, పది రోజుల్లో చింతమడక చెరువుకు జలకళ...

మరో రెండు,రోజుల్లో చింతమడక గ్రామ మధిర దమ్మ చెరువు, అంకంపేట గ్రామ పెద్ద చెరువు, వారం, పది రోజుల్లో చింతమడక చెరువు కాళేశ్వరం జలాలతో నిండనున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. మల్లన్నసాగర్ దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నిండనున్న చింతమడక గ్రామ, మధిర గ్రామాల చెరువుల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత తోర్నాల, ఇర్కోడ్ గ్రామాల వద్ద కాళేశ్వరం జలాల కాల్వల వద్ద జల హారతి పట్టి, గంగమ్మ తల్లికి పుష్ఫాభిషేకం నిర్వహించారు.

ఇదీ చూడండి: వ్యాప్తికి ముందే కరోనా జాడ కనిపెట్టొచ్చిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.