ETV Bharat / state

Harish rao: మన పథకాలు వారి రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? :హరీశ్​ రావు - రేషన్​ కార్డులు పంపిణీ చేసిన మంత్రి

తెరాస ఓట్ల కోసం పని చేయదని.... ప్రజల కష్టాలే అజెండాగా పనిచేస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్​లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

Harish rao
ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు
author img

By

Published : Jul 28, 2021, 4:23 PM IST

మన రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, రైతుబంధు పథకాలు భాజపా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్​లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు రేషన్ కార్డులు రావని తప్పుడు ప్రచారం చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ లోటు లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తూ రేషన్ కార్డులు ద్వారా ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, మండల, పట్టణ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

భాజపా, కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా మనలాంటి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. మాట ఇస్తే తప్పని పార్టీ మన తెరాస పార్టీ. అదేవిధంగా మన పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ పథకాల కింద సాయం చేస్తున్నాం. పేదల బిడ్డ ప్రభుత్వ దవాఖానాకు పోతే కేసీఆర్​ కిట్లు అందిస్తున్నాం. డయాలసిస్​ వచ్చిన వారికి ఉచితంగా అన్ని పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశాం. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో రేషన్​ కార్డులు కావాలని ప్రతి ఒక్కరు అడిగారు. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ తెరాసనే. అందుకే ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం. - హరీశ్​ రావు, రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు మంత్రి హరీశ్​ రావు సూచించారు. ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను వినియోగించకుండా ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వార్డులో ప్లాస్టిక్​ను నిరోధించి ప్లాస్టిక్ రహిత, ఆరోగ్యవంతమైన పట్టణంగా సిద్దిపేటను తీర్చి దిద్దాలని మంత్రి కోరారు. నన్ను ఎవరైనా ఫంక్షన్​కు పిలిస్తే అక్కడ ప్లాస్టిక్ లేకుండా ఉంటేనే వస్తానని హరీశ్​ రావు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు పూల చెట్లను పెంచాలని సూచించారు. ప్రతి గ్రామంలో చెత్తను సేకరించి డంప్ యార్డ్​కు తరలించే విధంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 90 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

MLA Rajagopal Reddy: 'ఈటలను ఓడించడానికే.. దళితబంధు పథకం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.