ETV Bharat / state

'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు.. పేదింటి ఆడబిడ్డలకు భరోసా' - harish rao latest news

కరోనా బాధితుల పట్ల వివక్షత వద్దు అన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్నివిధాలా అండంగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

minister harish rao distributed Kalyana Lakshmi and Shadi Mubarak checks at siddipet district
'కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు.. పేదింటి ఆడబిడ్డలకు భరోసా'
author img

By

Published : Aug 1, 2020, 5:54 PM IST

దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ కొండ భూదేవి గార్డెన్​లో సిద్ధిపేట అర్బన్, మున్సిపాలిటీ పరిధిలోని 286 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 86 లక్షల 33 వేల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

వారి పట్ల వివక్షత వద్దు...

కరోనా మహమ్మారి బాధితుల పట్ల సమాజంలో మార్పు రావాలన్నారు. కొవిడ్​ అనగానే అతిగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు.

వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి: ఆంజనేయుడిలా గాల్లో ఎగిరిన ఆటో డ్రైవర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.