ETV Bharat / state

హుస్నాబాద్​లో కఠినంగా లాక్​డౌన్ అమలు - నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు

హుస్నాబాద్​లో లాక్​డౌన్​ ఆంక్షలు పటిష్టంగా అమలవుతున్నాయి. ఒకవైపు కఠిన నిబంధనలు, మరోవైపు ఎండలు తీవ్రంగా ఉండటం వల్ల జనాలు బయటకు రావట్లేదు. కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి.

lockdown rules strictly executed in husnabad
హుస్నాబాద్​లో కఠినంగా లాక్​డౌన్​ అమలు
author img

By

Published : May 18, 2021, 5:35 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో లాక్​డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ప్రధాన కూడళ్లలో పహారా కాస్తూ పటిష్టంగా లాక్​డౌన్ అమలు అయ్యేలా కృషి చేస్తున్నారు.

అకారణంగా బయటకి వస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.

ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.