వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రెండు నెలల పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ దవాఖానా ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట పట్టణంలోని రవి పిల్లల ఆస్పత్రికి ములుగు గ్రామానికి చెందిన జాలిగామ శ్రీకాంత్, వినోద దంపతులు తమ కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చారు. శిశువును పరిశీలించిన డాక్టర్ రవిబాబు ఆరోగ్యం బాగానే ఉందని... మోషన్స్ ఫ్రీ కావడానికి ఒక సిరప్ ఇచ్చారని బాబు తండ్రి తెలిపారు. సిరప్ ఇచ్చిన తర్వాత బాబులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో వైద్యున్ని సంప్రదించామని శ్రీకాంత్ చెప్పారు. శిశువును పరిశీలించిన డాక్టర్ రవిబాబు వెంటనే శిశువుకు వెంటిలేటర్ అవసరమని సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేశారు.
వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శిశువును ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ శిశువును పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందాడని తెలపడం వల్ల మృతదేహంతో... రవి పిల్లల ఆస్పత్రి ముందు శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుని నిర్లక్ష్యం వల్లే తమ బాబు చనిపోయాడని తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న సీఐ సైదులు అక్కడకు చేరుకుని బాధితులకు చట్టప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.
ఇవీ చూడండి: అనుమానాస్పదస్థితిలో తల్లీకూతురు మృతి