సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. ఉదయమంతా భానుడి ప్రతాపంతో మండి.. ఉన్నట్టుండి ఆకాశమంతా మేఘావృతమైంది.
పలు చోట్ల ఈదురుగాలలతో కూడిన వడగండ్ల వాన కురిసింది. చేతికందిన వరి చేను కోయకుండానే అకాల వర్షానికి దెబ్బతిందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక