ETV Bharat / state

Harishrao fires on Kishan Reddy : 'తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారో కిషన్‌రెడ్డి చెప్పాలి'

Harishrao comments on BJP development works in telangana : రాష్ట్ర విభజన చట్టంలోని హమీలను కేంద్రం ఎందుకు నెరవేర్చరో సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్​రావు డిమాండ్ చేశారు. బీబీనగర్ ఎయిమ్స్​కు నామమాత్రంగా నిధులు ఇచ్చి కేంద్రం చేతులు తుడుచుకుందని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో కేంద్రం సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై ఇవాళ కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్​పై హరీశ్​ రావు స్పందించారు.

Harishrao
Harishrao
author img

By

Published : Jun 17, 2023, 9:38 PM IST

Minister Harish Rao latest comments : ఆయుష్మాన్ భారత్​ కింద కేంద్ర ప్రభుత్వం గోరంత ఇస్తే.. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొండంత ఇచ్చిందని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఇవాళ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి పవర్​ పాయింట్ ప్రజంటేషన్​పై మంత్రి స్పందించారు. బీబీనగర్ ఎయిమ్స్​కు నామమాత్రంగా నిధులు విడుదల చేసి నత్తనడకగా పనులు జరుగుతుంటే దానిని గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రానికి రావాలసిన బకాయిలపై కేంద్రానికి లేఖలు రాసి అలసిపోయామని పేర్కొన్నారు.

ఫైనాన్స్ కమిషన్ చెప్పినా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.723 కోట్ల పరిహారాన్ని మూడేళ్ల నుంచి అడుగుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఏపీ ఖాతాలోకి పొరపాటున జమ చేసిన రూ.495 కోట్లను తొమ్మిదేళ్ల నుంచి అడుగుతున్నా కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ.24 వేల 205కోట్ల ఇవ్వాలని నీతీఆయోగ్ సూచించినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు. విద్యుత్ మీటర్ల నిబంధనతో రాష్ట్రానికి రూ.30వేల కోట్ల నష్టాన్ని కేంద్రం ప్రభుత్వం చేసిందని ధ్వజమెత్తారు.

Minister Harishrao fires on central government : పన్నుల వాటా సక్రమంగా అమలు చేస్తే రూ.33వేల 712కోట్ల బకాయిలు రాష్ట్రానికి అదనంగా వచ్చేవని పేర్కొన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన రూ.లక్ష 35 వేల 812 కోట్లను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి అబద్దాల పుట్టను త్వరలోనే పూర్తి ఆధారాలతో పవర్​ పాయింట్ ప్రజంటేషన్​ చేస్తామని హరీశ్​రావు పేర్కొన్నారు.

Harish Rao at double bed room houses opening ceremony : అంతకు ముందు సిద్ధిపేట జిల్లా మార్కుక్​ మండలం పాములపర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం, కావేరి సీడ్స్ భాస్కర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్​ బెడ్​ రూం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడిన హరీశ్​ రావు.. ఇవాళ పక్క రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకం రాష్ట్రంలో అమలవుతోందన్నారు. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో రూ. లక్ష పదహారు వేలు ఇస్తే.. అదే గుజరాత్​లో కేవలం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.

పేదల తలరాతను మార్చిన నేత కేసీఆర్: కులం,మతం, వర్గం, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఈ పథకం ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఛత్తీస్​ఘడ్, బీహార్ రాష్ట్రం నుంచి ఇవాళ బతుకు దెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారన్నారు. గతంలో ఏంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన పేదల బతుకులు మారలేదని.. తెలంగాణ పేద ప్రజల బతుకులు మార్చిన నేత కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

Revanth reddy fires on BRS : 'బీజేపీలాగే.. బీఆర్​ఎస్ 30శాతం కమీషన్​ సర్కారు'

Harishrao Comments: 'కేంద్ర మంత్రులు దిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారు'

KTR Praises Harish Rao in Siddipet : 'మా బావను అప్పుడప్పుడు సరదాగా ఏడిపిస్తుంటా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.