ETV Bharat / state

కాంగ్రెస్​, భాజపా గోబెల్స్​ ప్రచారం చేస్తున్నాయి: హరీశ్​

కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీపై.. కాంగ్రెస్, భాజపాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాలువకు చిన్నగండి పడితే పెద్ద రాద్దాంతం చేస్తున్నాయన్న హరీశ్... కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం.. ఆశ్చర్యంగా ఉందన్నారు.

కాంగ్రెస్​, భాజపా గ్లోబెల్స్​ ప్రచారం చేస్తున్నాయి: హరీశ్​

author img

By

Published : Jul 1, 2020, 8:13 PM IST

Updated : Jul 1, 2020, 8:32 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు కాలువకు చిన్న గండి పడితే కాంగ్రెస్, భాజపా నాయకులు గగ్గోలు పెడుతూ గోబల్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్​రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. చిన్న కాలువకు గండి పడితే పెద్ద రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు కూడా ట్రయల్​ రన్​ సమయాల్లో గండి పడిన విషయాన్ని గుర్తు చేశారు.

అసాధ్యమనుకున్న గోదావరి నీటిని తెచ్చి రాష్ట్ర రైతాంగానికి అందించిన ఘనత సీఎం కేసీఆరేకే దక్కిందన్నారు. కాంగ్రెస్​ పార్టీ అంటే గోబెల్స్ పార్టీ అని ముద్ర పడిందని అందుకే ప్రతి పక్ష హోదా కూడా కోల్పోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్​ చరిత్రలో ఎన్నడు లేని విధంగా చెరువులు నింపామన్నారు. కొండపోచమ్మ సాగర్​కు వచ్చిన కాంగ్రెస్, భాజపా నేతలు.. ఆ నీరు నేతి మీద పోసుకుని, చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టుకోవాలని సూచించారు. సలహాలివ్వడం మాని బురద చల్లి పోవాలని చూస్తే ఒప్పుకొమని ఘాటుగా హెచ్చరించారు.

ఇవీ చూడండి: ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..

Last Updated : Jul 1, 2020, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.