సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పీఏసీఎస్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జనవరిలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.5800 చొప్పున మద్దతు ధరతో ఇప్పటివరకు 34 మంది రైతుల నుంచి సుమారు 338 క్వింటాళ్ల కందులను కొనుగోళ్లు చేశారు. తేమ, నాణ్యత నిబంధనలతో కొనుగోళ్లు మందగించాయి. సమీప గ్రామాల నుంచి కందులను విక్రయించడానికి వస్తున్న రైతులకు నిరీక్షణ తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతుల కందులే కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయని సిబ్బంది తెలపడంతో రైతులు ఆందోళన చేశారు. ఖరీఫ్ ఆరంభంలో రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేసినా... సగానికిపైగా పేరు లేకపోవడం సమస్యగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: తినేదానికంటే నేలపాలయ్యే ఆహారమే ఎక్కువ!