ETV Bharat / state

'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’ - CPI Leaders Visit Paddy Buying Centers In Siddipet district

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిద్ధిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్​ డిమాండ్​ చేశారు.

CPI Leaders Visit Paddy Buying Centers  In Siddipet district
'తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి’
author img

By

Published : May 7, 2020, 9:48 PM IST

సిద్ధిపేట జిల్లాలోని పందిల్ల, కుచనపల్లి, గోవర్ధనగిరి, బొడిగెపల్లి, గుబ్బడి, జనగాం, గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీపీఐ జిల్లా నాయకులు సందర్శించారు. అకాల వర్షానికి తడిసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్​ చేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రం వద్ద 20 రోజులకు పైగా ధాన్యాన్ని నిల్వ ఉంచుతున్నారని, అందుకే.. అకాల వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎప్పటి ధాన్యం అప్పుడు కొనుగోలు చేస్తే.. ఈ సమస్య వచ్చేది కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్​ ఆగ్రహించారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు పంపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే.. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.