ETV Bharat / state

ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు కాళేశ్వరం :కేసీఆర్

author img

By

Published : May 29, 2020, 2:40 PM IST

ప్రపంచం అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని సీఎం కేసీఆర్​ అన్నారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

cm kcr inaugurated kondapochamma project in siddipeta district
కాళేశ్వరం ప్రపంచం అబ్బురపడే ప్రాజెక్టు: సీఎం

యావత్తు ప్రపంచం అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామన్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టులు తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. నేడు పసిడి పంటల తెలంగాణ ఆవిష్కృతమైందన్నారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించిన ఆయన.. ప్రాజెక్టుల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర రాష్ట్రాల కూలీల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. తక్కువ సమయంలో 165 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం చేశామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి నిర్వాసితులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం కేసీఆర్ కొనియాడారు. భూ నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: 'మార్నింగ్​ ట్రైనింగ్​ సెషన్స్​ను మిస్సవుతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.