ETV Bharat / state

సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా - సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులను తొలగిస్తూ విడుదల చేసిన మెమోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో దుబ్బాక తహసీల్దార్​ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. మెమో 2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

citu leaders protested in siddipet district
సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా
author img

By

Published : Sep 1, 2020, 12:03 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ కార్మికులను తొలగిస్తూ విడుదల చేసిన మెమో నంబర్ 2026ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 28వేల 200 మంది స్వచ్ఛ కార్మికులు పని చేస్తున్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్​ తెలిపారు. కార్మికుల పొట్టకొట్టే మెమో 2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ కార్మికులను యధావిధిగా కొనసాగిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ కార్మికుల యూనియన్​ జిల్లా అధ్యక్షులు ర్యాకం ఎల్లం, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్ష ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.