ETV Bharat / state

ఆరో రోజు కొనసాగిన పరిహారం పంపిణీ

మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల్లో ఆరో రోజున పరిహారం పంపిణీ కోలాహలంగా  కొనసాగింది. తమ గ్రామానికి వచ్చిన అధికారులను వేములఘాట్ గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో ఆహ్వానించి సన్మానించారు. దేశంలో అత్యుత్తమ పరిహారం అందిస్తున్నారన్న సంతోషంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఆరో రోజు కొనసాగిన పరిహారం పంపిణీ
author img

By

Published : May 9, 2019, 5:40 AM IST

ముఖ్యమంత్రి ఆదేశాలతో మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామాల్లో కేంద్రాల ద్వారా పరిహారం అందిస్తున్నారు. బుధవారం నాడు సిద్దిపేట జిల్లా వేములఘాట్​లో ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించారు. పరిహారం అందించడానికి వచ్చిన అధికారుల బృందానికి గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో ఆహ్వానం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఒక్కొక్క కుటుంబానికి పునరోపాధి కింద ఏడున్నర లక్షలు, పునరావాసం కింద గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ వద్ద 250 గజాల ఇంటి స్థలంతో పాటు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నారు. వీటికి సంబంధించిన కేటాయింపు పత్రాలను నిర్వాసితులకు అందించారు. గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి 5 లక్షలు, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారంపై నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఇస్తున్న డబ్బును దుబారా చేసుకోవద్దని యువకులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న 5 లక్షల రూపాయలను ఉన్నత విద్యకు, ఉపాధికి వినియోగించుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇంటి స్థలానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని.. దానిని అమ్ముకోవద్దని చెబుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించిన యువతకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.

కొండపోచమ్మ జలాశయం కింద ముంపుకు గురవతున్న బైలంపూర్, మామిడ్యాల గ్రామస్థులకు కూడా అధికారులు పరిహారం అందించారు.

ఆరో రోజు కొనసాగిన పరిహారం పంపిణీ

ఇవీ చూడండి: పనామా చోరీ రాంజీ గ్యాంగ్ పనేనా?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.