ETV Bharat / state

దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్​ - తెరాసపై మండిపడిన కె.లక్ష్మణ్​

ప్రభుత్వ పనితీరును ప్రజలముందుంచి ఓట్లు అడగాలని.. అధికారం అడ్డం పెట్టుకొని గెలవాలనుకోవడం సరైంది కాదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే పోలీసులతో దాడులు చేయిస్తోందని విమర్శించారు.

bjp laxman
దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్​
author img

By

Published : Oct 27, 2020, 2:09 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా కార్యకర్తలు, నాయకులపైన.. తెరాస ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను అక్రమంగా అరెస్టు చేయించిందని మండిపడ్డారు.

అధికార పార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గడం సరైంది కాదని లక్ష్మణ్​ సూచించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పనితీరును ప్రజల ముందుంచి ఓట్లడగాలని.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని గెలవాలని తెరాస భావిస్తే ప్రజలు సహించరన్నారు.

దుబ్బాకలో ఓటమి భయంతోనే దాడులు: లక్ష్మణ్​

ఇవీచూడండి: దుబ్బాకలో భాజపా గెలవబోతోంది: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.