ETV Bharat / state

మల్లన్నసాగర్‌ టన్నెల్‌ పక్కన ఏర్పడిన భారీ గుంత - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డి పేట గ్రామం వద్ద మల్లన్నసాగర్ టన్నెల్ పక్కన భారీ గుంత ఏర్పడింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధికారులు ఆ గుంతను పరిశీలించారు. ఆ గుంతకు మల్లన్నసాగర్ టన్నెల్ మార్గానికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధరణకు వచ్చారు. పాత బావికి సంబంధించిన గుంత కావడం వల్ల పూడ్చివేశారు.

మల్లన్నసాగర్‌ టన్నెల్‌ పక్కన ఏర్పడిన భారీ గుంత

author img

By

Published : Aug 27, 2020, 1:38 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేట్ గ్రామంలో చింతబావి దర్గా దగ్గరలో తొగుట, సిద్దిపేట రహదారి పక్కన బుధవారం నుంచి కురుస్తున్న వర్షానికి భారీ గుంత ఏర్పడింది. విషయం తెలుసుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు, తొగుట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి గుంత ఏర్పడిన చోటును పరిశీలించి అటువైపుగా ప్రయాణికులు రాకపోకలు కొనసాగించకుండా బారీకేడ్స్ ఏర్పాటు చేశారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధికారులు భారీ క్రేన్ సహాయంతో గుంత లోపలి వరకు పరిశీలించి.. ఏర్పడిన గుంతకు మల్లన్నసాగర్ టన్నెల్ మార్గానికి ఎటువంటి సంబంధం లేదని నిర్ధరణకు వచ్చారు. అనంతరం వెంటనే ఆ గుంతను పూడ్చి వేయించారు. అయితే బుధవారం రాత్రి 9 గంటల వరకు మూడు పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని, టన్నెల్‌కు ఏర్పడిన గుంతకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకేజీ 12 మల్లన్న సాగర్ ప్రాజెక్టు అధికారులు ఎస్‌ఈ ఆనంద్, రవీందర్, గోపాల్, ఇంజినీర్లు దగ్గరుండి పర్యవేక్షించారు.

ఇదీ చూడండి : వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.