ETV Bharat / state

అంబులెన్స్​ను ఉపయోగంలోకి తేవాలని విపక్షాల నిరసన!

author img

By

Published : Aug 23, 2020, 7:59 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్​ను ఉపయోగంలోకి తేవాలని విపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న ఆంబులెన్స్ వాహనాన్ని నాయకులు పరిశీలించారు. గత వారం రోజులుగా అంబులెన్స్​ నిరుపయోగంగా పడి ఉన్నా.. పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

All Parties Demands For Ambulance Service In Husnabad hospital
అంబులెన్స్​ను ఉపయోగంలోకి తేవాలని విపక్షాల నిరసన!

సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిరుపయోగంగా ఉన్న ఆంబులెన్స్​ను వాడుకలోకి తేవాలని విపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. గత వారం రోజులుగా అంబులెన్స్ చెడిపోయి నిరుపయోగంగా ఉన్నా.. పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం పట్ల విపక్షాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అప్​గ్రేడ్ చేసినప్పటికీ ఇంకా 30 పడకల ఆస్పత్రిగానే కొనసాగుతుందని, ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక సిబ్బంది కొరతతో సమస్యల నిలయంగా మారిందని ఆరోపించారు. కొత్త భవనంలో పైపై హంగులతో డాబు ప్రదర్శిస్తున్నారని.. ఆస్పత్రి పరిస్థితి పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా ఉందని పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్​ అన్నారు. గత పదేళ్లుగా జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్​కు చెందిన అంబులెన్స్ వాహనం డ్రైవర్ లేక నిరుపయోగంగా ఉందని, మరో వైపు హుస్నాబాద్​లో అంబులెన్స్ సౌకర్యం లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నా.. పూర్తి సామర్థ్యంతో ఉన్న ఈ వాహనాన్ని ఉపయోగంలోకి తేకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుస్నాబాద్​లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఎమ్మెల్యే సైతం కరోనా బారిన పడి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు నియోజకవర్గ కేంద్రంలో ఆయన ఆచూకీ లేదన్నారు. ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విపక్షాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తీవ్రతరం చేస్తామని విపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపే మల్లేష్, తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్, సామాజిక విశ్లేషకులు వడ్డేపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.