రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో పర్యటించారు. పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలో రూ. 80 లక్షలతో బిర్లా సైన్స్ మ్యూజియం, కోటి 40 లక్షలతో నిర్మిస్తున్న యోగా భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. సంగారెడ్డిలో నిర్మించే బిర్లా సైన్స్ మ్యూజియం రాష్ట్రంలో రెండవదని.. దీని ద్వారా జిల్లా విద్యార్థుల్లో వైజ్ఞానిక చైతన్యం పెంపొందుతుందని స్పష్టం చేశారు.
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజల్లో మానసిక ఒత్తిడి చాలా పెరిగిందని, దాని నుంచి ఉపశమనం యోగాతోనే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం చేస్తే జీవన విధానంలో మార్పులు వస్తాయని, పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలిపారు.
కొన్ని పాఠశాలలు విద్యార్థులను చదువు పేరుతో యంత్రాల మాదిరి తయారు చేస్తున్నాయని.. విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహించాలని సూచించారు.
- ఇదీ చూడండి : చిరుత సంచారం..జనాల్లో భయం భయం..