తెలంగాణ సాధనలో పద్మశాలి సంఘం ఎంతో కృషి చేసిందని తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ కొనియాడారు. వారు అనేక రంగాల్లో ముందుకు సాగడం సంతోషంగా ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.
చేనేత కార్మికులు ఎంతో కష్టపడి పైస్థాయికి ఎదుగుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ ప్రాణాలు కోల్పోయిన ఘనత పద్మశాలి సంఘాలకు దక్కింది. పద్మశాలి పోరాట యోధుల బిడ్డలుగా ఉన్నందుకు గర్విస్తున్నాను.
-ఎల్.రమణ, తెదేపా అధ్యక్షుడు
ఘనత వారిదే..
అగ్గిపెట్టెలో చీరను ఎగుమతి చేసిన ఘనత పద్మశాలిలకు ఉందని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభకర్ అన్నారు. తెరాస ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. సంగారెడ్డిలో చేనేత భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు గుండు సుధారాణి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: గంగపుత్రులను బాధపెట్టే వ్యాఖ్యలు చేయలే.. : తలసాని